అన్నీ ఉన్నా చైనాలో అనాథలయ్యాం

అన్నీ ఉన్నా చైనాలో అనాథలయ్యాం

చైనాలో ఉంటున్న తమ దేశస్థుల్ని తిరిగి స్వదేశానికి తెచ్చేలా భారత్, బంగ్లాదేశ్ లు ఏర్పాట్లు చేస్తున్నాయి. పాక్ మాత్రం ఆదేశ పౌరుల భద్రత ను విస్మరించినట్లు తెలుస్తోంది.

వుహన్ లో ఉంటున్న తమని కాపాడాలని కోరుతూ పాక్ విద్యార్ధులు షేర్ చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.

కరోనా వైరస్ నుంచి తమని కాపాడాలని చైనాలో ఉంటున్న పాక్ విద్యార్ధులు ఆదేశ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా పాక్ విద్యార్ధులు తమ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియోల్ని విడుదల చేస్తున్నారు.

వుహాన్ లో ఉంటున్న తమని కాపాడాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారత్ తో పాటు బంగ్లాదేశ్ ప్రభుత్వాలు తమ దేశ పౌరుల్ని కాపాడుకునేందుకు వుహాన్ కు ప్రత్యేక బస్సుల ద్వారా ఎయిర్ పోర్ట్ కు తరలిస్తున్నారు. కానీ మా దేశ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని వుహాన్ యూనివర్సిటీ పాక్ విద్యార్ధి చెబుతున్నాడు.

అంతేకాదు చైనా లో ఉంటున్న తమని తమ దేశానికి తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో వుహాన్ లో ఉంటున్న పాక్ విద్యార్ధులు అనాథలుగా మిగిపోయారని చెబుతున్నారు.

Pakistani Student in China

Pakistani Govt is not helping Us in China while Indian govt is saving their students in China: Pakistani Students

Posted by Rising India on Saturday, February 1, 2020