పాక్​లో ఆర్మీ కాన్వాయ్‌‌పై టెర్రర్ అటాక్

పాక్​లో ఆర్మీ కాన్వాయ్‌‌పై టెర్రర్ అటాక్
  • ఆరుగురు జవాన్లు మృతి.. నలుగురు మిలిటెంట్లు హతం

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా  ప్రావిన్స్‌‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌‌పై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అఫ్గానిస్తాన్ బార్డర్లోని అస్మాన్ మాంజా ప్రాంతంలో ఈ దాడి జరిగిందని ఇంటర్- సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) మంగళవారం తెలిపింది. తెహ్రీక్ -ఎ -తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) గ్రూపునకు చెందిన టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడించింది. 

ఈ ఘటనలో ఆరుగురు సైనికులు చనిపోయారని వివరించింది. జవాన్ల ఎదురు కాల్పుల్లో.. నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారని, మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పింది. ఆ ఏరియాలో ఉన్న టెర్రరిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నదని పేర్కొంది.