పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు: సంకీర్ణం దిశగా రిజల్ట్స్.. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 99 సీట్లు

పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు: సంకీర్ణం దిశగా రిజల్ట్స్.. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 99 సీట్లు

పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రెండు రోజులు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నా తుది ఫలితంపై ఇంకా స్పష్టత రాలేదు. పాకిస్తాన్  సార్వత్రిక ఎన్నికల్లో పీటీఐ పార్టీకి అనుబంధంగా ఉన్నస్వతంత్ర అభ్యర్థులు, జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల విజయంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశంఉందని స్థానిక మీడియా చెబుతోంది. మరో వైపు రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు కు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 

పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలలో ఇప్పటి వరకు ఏ పార్టీకి మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు.మొత్తం 265 స్థానాలకు ఎన్నికలు జరగగా .. ఇప్పటవరకు విడుదలైన ఫలితాలలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా 99 స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయడానికి మొగ్గుచూపుతుంది. ఇప్పటివరకు 69 సీట్లతో రెండవ అత్యధికత స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 51 స్థానాలతో మూడోస్థానంలో ఉంది. 

మిగిలిన 22 సీట్లు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్ ఎన్ లేదా పీపీపీకి ఆధిక్యం ఇవ్వడానికి సరిపోవు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 133. ఈ సంఖ్యకు దగ్గరలో ఏ పార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తప్పనిసరిగా మారింది.