ISSF‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో తెలుగు కుర్రాడు నేలవల్లి ముకేశ్‌‌‌‌ రికార్డు 

ISSF‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో తెలుగు కుర్రాడు నేలవల్లి ముకేశ్‌‌‌‌ రికార్డు 

గ్రెనెడా (స్పెయిన్‌‌‌‌): తెలుగు కుర్రాడు నేలవల్లి ముకేశ్‌‌‌‌ ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో రికార్డు సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్​ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో పాలక్‌‌‌‌తో కలిసి వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తూ గోల్డ్ మెడల్ నెగ్గాడు. మంగళవారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌‌‌‌లో పాలక్‌‌‌‌–ముకేశ్‌‌‌‌ 487.7 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచారు. ఈ క్రమంలో జూనియర్‌‌‌‌ విభాగంలోనూ కొత్త వరల్డ్‌‌‌‌ రికార్డును నమోదు చేశారు. స్టార్టింగ్‌‌‌‌ నుంచే అద్భుతమైన గురితో ఆకట్టుకున్న ఇండియా షూటర్లు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. 

దాంతో పాలక్‌‌‌‌ 243, ముకేశ్‌‌‌‌ 244.7 పాయింట్లు రాబట్టారు. చైనా షూటర్లు క్వియాన్‌‌‌‌జున్‌‌‌‌–కాయ్‌‌‌‌ హో 484.8 పాయింట్లతో రజతం నెగ్గింది. హంగేరికి చెందిన వెరోనికా మేజర్‌‌‌‌–అకోస్‌‌‌‌ కరోలీ 414.9 పాయింట్లతో బ్రాంజ్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనూ ముకేశ్‌‌‌‌–పాలక్‌‌‌‌ జోడీ ఆకట్టుకుంది. 581-–17 ఎక్స్‌‌‌‌ పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచి ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించింది. ఒలింపియన్‌‌‌‌ గగన్‌‌‌‌ నారంగ్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ అకాడమీలో ట్రెయినింగ్‌‌‌‌ తీసుకున్న ముకేశ్‌‌‌‌.. జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా కొనసాగుతున్నాడు.