
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రూ.10,772 కోట్ల అంచనాతో రూపొందించిన 2025–26 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను బుధవారం పాలమూరు కలెక్టర్ విజయేందిర బోయి రిలీజ్ చేశారు. కలెక్టరేట్ లో బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకర్లు నిర్దేశంచబడిన లక్ష్యాల మేరకు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,390.57 కోట్ల రుణ లక్ష్యానికి గాను, రూ.7,223.68 కోట్ల రుణాలను మంజూరు చేసి 86.10 శాతం ప్రగతి సాధించినట్లు తెలిపారు.
ఈ సంవత్సరం వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.5,906.93 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.2,268.95 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.8,353 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కల్వ భాస్కర్, ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి ఎంజడ్.రహమాన్, నాబార్డ్ జిల్లా అభివృద్ది మేనేజర్ పి.షణ్ముఖచారి పాల్గొన్నారు.