
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ అమెరికా లోని గ్లోబల్ సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది హోల్ చైల్డ్, నాట్రే డామ్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పీయూ వీసీ శ్రీనివాస్ సమక్షంలో రిజిస్టర్ పూస రమేశ్ బాబు గ్లోబల్ సెంటర్ ప్రతినిధి రుబీనా ఫిలిప్ సోమవారం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
అనంతరం పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సామాజిక భావోద్వేగ అభ్యసనపై యూనివర్సిటీల ఒప్పందం ద్వారా కాలేజీలు లాభపడాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కర్ణాకర్ రెడ్డి , లెక్చరర్లు డాక్టర్ బషీరాబాద్, డాక్టర్ జయనాయక్, డాక్టర్ విజయలక్ష్మి, వివిధ కాలేజ్ ల బీఈడీ లెక్చరర్లు పాల్గొన్నారు.