‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌

 ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌

నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్‌‌‌‌లో రూపొందుతున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.  మాళవిక నాయర్ హీరోయిన్‌‌‌‌. ఈ మూవీ ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌ను సోమవారం విడుదల చేశారు. నాగశౌర్య, మాళవిక  ఇద్దరూ ఫార్మల్ వింటర్‌‌‌‌వేర్ ధరించి, బస్సు జర్నీలో ఒకరిపై ఒకరు వాలిపోయి మ్యూజిక్ వింటూ కనిపిస్తున్న పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. ‘‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనేది పదేళ్ల పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం.

18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకెళుతుంది. ఇందులో లవ్ సీన్స్  చాలా నేచురల్‌‌‌‌గా ఉంటాయి. ప్రేమను ఇంద్రధనుస్సులా ఏడు రంగులలో చూపించబోతున్నాం’ అంటూ ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా శ్రీనివాస్ అవసరాల చెప్పాడు. టీజీ విశ్వ ప్రసాద్,  దాసరి పద్మజ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌. కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.