నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ కు బిగ్ రిలీఫ్

నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ కు బిగ్ రిలీఫ్

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. తనకు, తన సోదరుడికి జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ప్రశాంత్  పిటిషన్ వేయగా...  బెయిల్ లో ఇచ్చిన కండిషన్ రెండు నెలలు పూర్తి అయిందని  తెలిపాడు.  రిలాక్సేషన్ కండిషన్ అప్లికేషన్ పిటిషన్ పై  విచారణ జరిపిన కోర్టు..   పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు పోలీసులు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసింది.  

బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అనంతరం   అన్నపూర్ణ స్టూడియో వద్ద అతని అభిమానులు నానా హంగామా సృష్టించారు. ఆర్టీసీ  బస్సులపై దాడి చేశారు.  అంతేకాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంతి, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ పల్లవి ప్రశాంత్ తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయగా.. శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది