
రాష్ట్ర వ్యాప్తంగా 12,700 గ్రామాలకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామంలో ప్రారంభించిన అమె పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, నర్సరీ, వైకుంఠధామం ఉన్నట్టుగా .. అలాగే ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణం ఉండాలని సీఎం ఆదేశించారని అన్నారు. ప్రతి ఇంటి నుండి చెత్తని సేకరించడానికి, చెట్లకు నీరు పోయాడానికి ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా స్కూల్ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక షాబాద్ మండలానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపారని, అందుకే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయని, రానున్న రోజుల్లో షాబాద్ మండలం మరింతగా అభివృద్ధి చెందుతుందని మంత్రి వ్యాఖ్యనించారు.
మరిన్ని వార్తల కోసం
అమిత్ షాకు క్రీడల శాఖ బాగుంటది