రోహిత్ వర్మ హీరోగా గోవింద రెడ్డి చందా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రియా సుమన్ హీరోయిన్. క్రేజీ కింగ్స్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. ‘పల్నాడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో హీరో రోహిత్ వర్మ ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్ కుమార్, దేవి ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
