క్యాష్ డిపాజిట్లు, విత్‌‌‌‌డ్రాల లిమిట్‌‌‌‌ను సవరించిన ప్రభుత్వం

 క్యాష్ డిపాజిట్లు, విత్‌‌‌‌డ్రాల లిమిట్‌‌‌‌ను సవరించిన ప్రభుత్వం

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: అక్రమంగా డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసేవారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం క్యాష్ డిపాజిట్లు, విత్‌‌‌‌డ్రాల లిమిట్‌‌‌‌ను సవరించింది. కొత్త రూల్స్ ప్రకారం ఏడాదిలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను డిపాజిట్‌‌‌‌ చేయాలన్నా, విత్‌‌‌‌డ్రా చేయాలన్నా పాన్‌‌‌‌ కార్డు, ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డ్ డిటెయిల్స్‌‌‌‌ను తప్పనిసరిగా  అందించాల్సి ఉంటుంది. గతంలో ఇండివిడ్యువల్స్‌‌‌‌ రోజుకి రూ. 50 వేల కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను డిపాజిట్‌‌‌‌, విత్‌‌‌‌డ్రా చేయాలనుకుంటే   పాన్‌‌‌‌ డిటెయిల్స్‌‌‌‌ ఇవ్వడం తప్పనిసరి. కానీ, ఏడాది మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్లపై ఎటువంటి లిమిట్ ఉండేది కాదు. కానీ, కొత్త రూల్స్ ప్రకారం  ఏడాదిలో ఒకటి లేదా అంతేకంటే ఎక్కువ బ్యాంక్‌‌‌‌  అకౌంట్లలో  పెద్ద  మొత్తంలో డిపాజిట్లు చేయాలనుకుంటే పాన్‌‌‌‌, ఆధార్ డిటెయిల్స్‌‌‌‌ను బ్యాంక్‌‌‌‌లకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు లేని వారు  రోజుకి రూ. 50 వేల కంటే ఎక్కువ  లేదా ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో  రూ.20 లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరపాలనుకుంటే  ఏడు రోజుల ముందే పాన్‌‌‌‌ కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలి.  ఆర్థిక మోసాలను తగ్గించేందుకు, అక్రమంగా జరిగే మనీ ట్రాన్స్‌‌ఫర్లను ఆపేందుకు ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు  తాజా క్యాష్ లిమిట్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను అమలుచేస్తున్నాయి. అంతేకాకుండా రూ. 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను క్యాష్‌‌‌‌ (ఫిజికల్‌‌‌‌) గా తీసుకోవడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఎక్కువ వాల్యూ ఉన్న ట్రాన్సాక్షన్లలో క్యాష్ వాడకాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అందువలన కుటుంబ సభ్యుల నుంచి కూడా రూ. 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను క్యాష్‌‌‌‌గా పొందకూడదు.

 క్యాష్‌ లిమిట్ రూల్స్‌.. 

1 ఏ కారణంగానైనా  రూ. 2 లక్షల కంటే ఎక్కువ క్యాష్‌‌‌‌ ను(ఫిజికల్‌‌‌‌గా) వాడడాన్ని ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్  బ్యాన్ చేసింది. ఉదాహరణకు  రూ. 3 లక్షల విలువైన జ్యువెలరీని కొంటే ఇందులో రూ. 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను ఒకేరోజు లేదా ఒకేసారి క్యాష్‌‌‌‌గా చెల్లించకూడదు. ఒకవేళ రూ. 3 లక్షల బిల్లును ఒకే ట్రాన్సాక్షన్‌‌‌‌లో పూర్తి చేయాలనుకుంటే చెక్‌‌‌‌, క్రెడిట్‌‌‌‌ కార్డ్‌‌‌‌, డెబిట్ కార్డ్‌‌‌‌ లేదా బ్యాంక్ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ల ద్వారానే జరపాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకునేటప్పుడు కూడా ఈ రూల్స్‌‌‌‌ను ఫాలో కావాల్సిందే. 

2 ఒక్కరి నుంచే లేదా ఒకేసారి  రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువున్న గిఫ్ట్‌‌‌‌లను అందుకోవడం కూడా ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ రూల్స్‌‌‌‌కు విరుద్ధం. ఈ రూల్స్‌‌‌‌ను ఉల్లంఘిస్తే వారిపై భారీగా పెనాల్టీ పడుతుంది. కొన్నిసార్లు ఎంత అమౌంట్‌‌‌‌ అందుకున్నారో అంతా పెనాల్టీ కింద కట్టాల్సి ఉంటుంది. 

3పన్ను చెల్లింపుదారులు క్యాష్‌‌‌‌ రూపంలో కట్టిన హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ట్యాక్స్ డిడక్షన్‌‌‌‌గా వాడుకునే వీలుండదు. సెక్షన్‌‌‌‌ 80 డీ కింద ట్యాక్స్ డిడక్షన్‌‌‌‌ పొందాలంటే ట్యాక్స్‌‌‌‌పేయర్లు తమ హెల్త్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ను బ్యాంక్‌‌‌‌ల ద్వారానే చెల్లించాలి. 

4ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్ నుంచి లేదా స్నేహితుడి నుంచి క్యాష్ రూపంలో లోన్ తీసుకోవాలనుకునే వారు రూ. 20,000 కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను తీసుకోకూడదు. లోన్ తీర్చేటప్పుడు కూడా క్యాష్ రూపంలో రూ. 20 వేల కంటే ఎక్కువ అమౌంట్‌‌‌‌ను ఇవ్వకూడదు.