
ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా గురువారం వరల్డ్‌వైడ్‌గా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ‘కల్కి’లో ప్రభాస్ వాడిన స్పెషల్లీ డిజైన్డ్ వెహికల్ ‘బుజ్జి’ని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచారు. ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ దానితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. భైరవ(ప్రభాస్) పాత్ర కోసం ‘బుజ్జి’ని రూ.7కోట్ల ఖర్చుతో ఏఐ ఆధారితంగా రూపొందించారు. ముందు టైర్ల రిమ్ పరిమాణం 34.5 అంగుళాలు, పొడవు 6,075 మి.మీ, వెడల్పు 3,380 మి.మీ. ఎత్తు 2,186 మి.మీ కాగా, వెనుక మరో భారీ టైర్ ఉంది.