
జూలూరుపాడు, వెలుగు : మండలంలోని మాచినేనిపేటతండాలో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని గ్రామ పంచాయితీ కార్యాలయానికి శుక్రవారం గ్రామస్తులు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతలోనే తమ పేర్లు వచ్చినా.. ఇప్పుడు వాటిని తొలగించి అనర్హులకు కేటాయిస్తున్నారని వాపోయారు. వెంటనే అధికారులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని కోరారు.