ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క

నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ సిటీలోని ధర్మపురి కాలనీలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు అలీ షబ్బీర్ తో కలిసి అటెండయ్యారు. విందుకు హాజరైన ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్​ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ తమది సెక్యులర్ ప్రభుత్వమని, అందరిని కలుపుకొని వెళ్తామన్నారు. సీఎం రేవంత్​రెడ్డి రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్​బిన్​హందాన్, కేశ వేణు,నరాల రత్నాకర్, హారున్, ఖుద్దూస్​తదితరులు పాల్గొన్నారు.