రూ.20వేలు లంచం తీసుకుంటూ .. ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

రూ.20వేలు  లంచం తీసుకుంటూ ..   ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

కోనరావుపేట, వెలుగు : ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల పంచాయతీ సెక్రటరీగా జగదీశ్​ పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన బండారి ఓవేలు ఇంటి పర్మిషన్ కు ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకోగా సెక్రటరీ లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే పర్మిషన్​ ఇస్తానని తిప్పించుకుంటున్నాడు. గత నెల14న  రూ.10 వేలు ఇచ్చాడు. అయినా పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏసీబీ అధికారులను  ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం గ్రామ పంచాయతీ ఆఫీసులో మరో రూ.20వేలు తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.