సీఐటీయూ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలి : పాండురంగారెడ్డి

సీఐటీయూ రాష్ట్ర మహాసభలను సక్సెస్ చేయాలి : పాండురంగారెడ్డి

అమీన్​పూర్​, వెలుగు : ఈనెల 7,8,9 తేదీల్లో మెదక్​లో జరిగే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ అమీన్​పూర్​మున్సిపల్​పరిధిలోని బీరంగూడ కమాన్ నుంచి శివాలయం గుడికమాన్​వరకు శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. అనంతరం పాండురంగారెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. 

మోదీ ప్రభుత్వం పార్లమెంట్​లో ఉన్న బలంతో కార్మికులను బానిసలుగా చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్​కోడ్​లను తేచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సీఐటీయూ అని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, జార్జ్, శ్రీనివాస్​రెడ్డి, వీరస్వామి, రామకృష్ణ, జిలాని, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.