ఫెగసస్ రగడ: అనుమతిస్తే న్యూట్రల్ ఎక్స్ పర్ట్స్ తో కమిటీ

ఫెగసస్ రగడ: అనుమతిస్తే న్యూట్రల్ ఎక్స్ పర్ట్స్ తో కమిటీ

ఫెగసస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అఫిడవిట్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టు. 10 మంది పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలను ఖండించింది. ఐటీ శాఖ అనదపు కార్యదర్శి 2 పేజీలు, 6 పేరాలతో అఫిడవిట్  దాఖలు చేశారు. అయితే పెగసస్ ఇష్యూపై ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, ఇతర సంఘాలు లేవనెత్తిన అంశాలపై నిపుణులతో దర్యాప్తు చేయిస్తామని సుప్రీంకు తెలిపింది కేంద్రం. కోర్టు అనుమతిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్ తో కాకుండా న్యూట్రల్  ఎక్స్ పర్ట్స్ తో కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకు తెలిపారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. దీనికి గైడ్ లైన్స్ కోర్టు ఇవ్వొచ్చన్నారు. అయితే కేంద్రం అఫిడవిట్ తో తాము సంతృప్తి చెందలేదని చీఫ్ జస్టిస్ NV రమణ స్పష్టం చేశారు. డీటెయిల్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు టైమ్ ఇస్తామన్నారు. సెన్సిటివ్ మ్యాటర్ ను సెన్సేషనల్ అంశంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తుషార్ మెహతా చెప్పారు. ఈ అంశంలో జాతీయ భద్రతతో ముడిపడి ఉందన్నారు. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.