Aditya-L1 Mission: ఆదిత్య L1లో PAPA పేలోడ్ సౌరగాలి ప్రభావాన్ని గుర్తించింది

Aditya-L1 Mission: ఆదిత్య L1లో PAPA పేలోడ్  సౌరగాలి ప్రభావాన్ని గుర్తించింది

ఆదిత్య-L1 ఆన్ బోర్డులోని ఆదిత్య (PAPA) పేలోడ్ లోని ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ సక్సెస్ఫుల్గా పనిచేస్తోందని శుక్రవారం (ఫిబ్రవరి 23) వెల్లడించింది. దీని అధు నాతన సెన్సార్లు ఫిబ్రవరి 11,12,2024 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల మాస్ ఎజెక్షన్ల(CME) ప్రభావాన్ని విజయవంతంగా గుర్తించనిట్లు ఇస్రో ట్విట్టర్ లోతెలిపింది. 

PAPA అనేది తక్కువ శక్తి పరిధిలోని సౌర వపన ఎలక్ట్రాన్ లు, అయాన్ ల ఇన్ సిటు కొలతల కోసం రూపొందించబడిన శక్తి, మాస్ ఎనలైజర్. దీనికి రెండు సెన్పార్లు ఉంటాయి. సోలార్ విండ్ ఎలక్ట్రాణ్ ఎనర్జీ ప్రోబ్ నుంచి 3keV శక్తి పరిధిలోని ఎలక్ట్రాన్లను కొలవడం , సోలార్  విండ్ అయాన్ కంపోజిషన్ ఎనలైజర్ (25keV వరకు శక్తి పరిధిలోని అయాన్ లను కొలిచే , ద్రవ్యరాశి పరిధి 1-60amu). సౌర పవన కణాల రాక దిశను కొలవడానికి సెన్సారలు కూడా అమర్చబడి ఉంటాయి.

PAPA పేలోడ్ డిసెంబర్ 12, 2023 నుంచి పనిలో ఉందని ఇస్రో తెలిపింది. హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ దశలో దాని పరిశీలనలు ఉంటాయని ఇస్రో తెలిపింది.