
టీఎస్ పీఎస్సీ లో సంచలనం సృష్టించిన పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ లీకేజ్ ఘటన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్వేశారు.
దీనికి సంబంధించి పిల్ పై ఇవాళ విచారణకు స్వీకరించింది. టీఎస్పీఎస్సీతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.