పపువా న్యూగినియాలో 2 వేలకు చేరిన మరణాలు

పపువా న్యూగినియాలో 2 వేలకు చేరిన మరణాలు

మెల్​బోర్న్ : దాదాపుగా 2000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారని పపువా న్యూగినియా నేషనల్ డిజాస్టర్ సెంటర్ తెలిపింది. సోమవారం ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ (యూఎన్) కు లేఖ రాసింది. భవనాలు, ఫుడ్ గార్డెన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ దుర్ఘటన పెను ప్రమాదం చూపిందని పేర్కొంది. తమను ఆదుకోవాలని యూఎన్ కు విజ్ఞప్తి చేసింది. పోర్గెర మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించింది. కొండచరియలు విరిగిపడుతుండటంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడడం సవాలుగా మారిందని పేర్కొంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యం, ఇతర బృందాలు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.