
- ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు కారిడార్
- మధ్యలో హకీంపేట వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్
- ప్రాజెక్టు ఖర్చు రూ.2,232 కోట్లు
- ఈ నెల 22 వరకు టెండర్ల స్వీకరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ప్రాజెక్టులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్యారడైజ్‌నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్రోడ్వరకు నిర్మించ తలపెట్టిన కారిడార్–1కు టెండర్ల ప్రక్రియ పూర్తయి నిర్మాణానికి అవసరమైన సాయిల్‌టెస్టులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఎలివేటెడ్ కారిడార్–2 ప్రాజెక్టుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్యారడైజ్(జేబీఎస్) నుంచి శామీర్‌పేట వరకు నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ 90 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును నవంబరు ఆఖరు వారంలోనే ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 22 వరకు టెండర్లు ఆహ్వానిస్తారు. ఎంపికైన కంపెనీకి పనులు అప్పగించి నవంబరు చివరిలో పనులు ప్రారంభిస్తారని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
రూ.2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్–2
ఎలివేటెడ్ కారిడార్–2 ను జేబీఎస్ నుంచి హకీంపేట మీదుగా శామీర్‌పేట ఓఆర్ఆర్కు నిర్మించనున్నారు. మధ్యలో హకీంపేట వద్ద 445 మీటర్ల మేర అండర్గ్రౌండ్టన్నెల్నిర్మిస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మిలిటరీ స్థావరాలు ఉన్న నేపథ్యంలో భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని అండర్గ్రౌండ్టన్నెల్ను నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు.
మొత్తం18.10 కి.మీ. మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు 197 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారుల అంచనా. ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్‌కు చెందిన భూములు కాగా, మరో 84 ఎకరాలు ప్రైవేట్‌భూములను సేకరిస్తున్నారు. భూసేకరణ పనులు కూడా దాదాపు 90 శాతం మేర పూర్తయినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్నిర్మాణానికి భూసేకరణ, పరిహారాల చెల్లింపులతో కలిపి రూ.2,232 కోట్లతో ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే మిలిటరీ ఎస్టేట్భూములు, సికింద్రాబాద్కంటోన్మెంట్బోర్డుకు చెందిన భూములను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. అలాగే ఎలివేటెడ్ కారిడార్–1 ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీఫామ్రోడ్ వరకూ 5.32 కి.మీ. మేరకు డబుల్డెక్కర్ఎలివేటెడ్కారిడార్నిర్మించనున్నారు. మొత్తం రూ.1,580 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం74 ఎకరాలు భూసేకరణ పనులు పూర్తయ్యాయి. ఇందులో డిఫెన్స్ ల్యాండ్ 56 ఎకరాల వరకు, ప్రైవేట్ భూములను 9 ఎకరాల వరకు సేకరించినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియపూర్తయింది. సాయిల్టెస్ట్పనులు కొనసాగుతున్నాయి.