
- పారామెడికల్, ల్యాబ్‌టెక్నిషియన్స్ అభ్యర్థులు
జూబ్లీహిల్స్,వెలుగు: 2017లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ద్వారా పరీక్షలు రాసి 325 మంది అర్హత సాధించామని, ఏడేండ్లుగా పోస్టులు భర్తీ చేయడంలేదని అభ్యర్థులు విజయ్‌కుమార్, రహీం, శాంతి, మహేశ్వరి తదితరులు వాపోయారు. పారామెడికల్, ల్యాబ్టెక్నిషియన్స్అభ్యర్థులు మంగళవారం జూబ్లీహిల్స్‌లో సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారంతో వారిని పోలీసులు పెద్దమ్మ ఆలయం వద్ద అడ్డుకున్నారు. సీఎంను కలిసేందుకు కొందరికి అనుమతి ఇచ్చారు. దీంతో వారు సీఎం పీఏకు వినతిపత్రం అందించి.. డిప్యూటీ సీఎంను కలిసేందుకు గాంధీ భవన్‌కు వెళ్లారు.
న్యాయం చేయాలని మాజీ హోంగార్డులు ..
ఉమ్మడి ఏపీలో హోంగార్డులను పలు కారణాలతో తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం ఇంటిని ముట్టడించేందుకు మాజీ హోంగార్డులు వెళ్తుండగా పెద్దమ్మ ఆలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు హోంగార్డులు మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆదేశించిందని పేర్కొన్నారు.
అయితే.. ఫిజికల్టెస్ట్ ఫిట్నెస్ టెస్ట్‌లో కాకపోవడంతో అనర్హులుగా ప్రకటించారని వాపోయారు. తాము 40 ఏళ్లు పైబడి ఉన్నామని మానవతా దృష్టిలో తిరిగి విధుల్లో తీసుకోవాలని వరంగల్‌కు చెందిన చంద్రశేఖర్, జి.రవి, డి.సురేష్, బేబి రాణి తదితరులు సీఎంను కోరారు. కొందరిని మాత్రమే సీఎంను కలిసేందుకు అనుమతించారు.