పదోతరగతితో పారామెడికల్‌‌‌‌‌‌‌‌ పోస్టులు

పదోతరగతితో పారామెడికల్‌‌‌‌‌‌‌‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అవుట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదికన పారామెడికల్‌‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 1317

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఓ (ఫిమేల్‌‌‌‌‌‌‌‌ నర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్లీ): 839     
అర్హత: పదో తరగతి తత్సమాన ఉత్తీర్ణతతోపాటు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఎయిడ్‌‌‌‌‌‌‌‌ అర్హత సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా ఉండాలి. 
వయసు: 42 ఏండ్లకు మించ‌‌‌‌‌‌‌‌కూడదు. 
జీతం: నెలకు రూ.12000 చెల్లిస్తారు. 

శానిటరీ అటెండెంట్‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌: 312 
అర్హత: పదోతరగతి తత్సమాన అర్హత ఉండాలి. 
వయసు: 42 ఏండ్లు మించరాదు. 
జీతం: నెలకు రూ.12000 చెల్లిస్తారు. 
 

ఫార్మసిస్ట్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌ 2: 17
అర్హత: డీఫార్మసీ/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి. ఏపీ పారామెడికల్‌‌‌‌‌‌‌‌ కౌన్సెల్‌‌‌‌‌‌‌‌లో రిజిస్టరై ఉండాలి. 
వయసు:  42 ఏండ్లకు మించరాదు. 
జీతం: నెలకు రూ.28 వేలు ఇస్తారు. 
 

ల్యాబ్‌‌‌‌‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌ 2: 124 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెడికల్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి.
వయసు: 42 ఏళ్లకు మించకూడదు. 
జీతం: నెలకు రూ.28 వేలు చెల్లిస్తారు. 
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్, పని అనుభవం.
దరఖాస్తులు: ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 5 డిసెంబర్
అడ్రస్: అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి పంపించాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తమ జిల్లా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను చూడాలి.
వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌: www.cfw.ap.nic.in