దేవరుప్పుల కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల ముందు పేరెంట్స్ ఆందోళన

దేవరుప్పుల కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల ముందు పేరెంట్స్ ఆందోళన

ఫుడ్ పాయిజన్ జరిగిన దేవరుప్పుల కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను డీఈవో రాము, ఆర్డీవో మదన్ మోహన్ తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఫుడ్ పాయిజన్ పై అధికారులు, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోపక్క ఈ ఘటన తర్వాత పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తున్నారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటన అనంతరం పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ప్రిన్సిపల్ సుకన్య నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై మొదటగా తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇవ్వనట్టు తెలుస్తోంది. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులపై పేరెంట్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల ముందు తల్లితండ్రుల ఆందోళన చేపట్టారు.

జనగామ జిల్లా దేవరుప్పల కస్తూర్భా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు హాజరయ్యారు. విద్యార్థులను జనగాం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బల్లిపడ్డ భోజనం తినడంతోనే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. దోసకాయ కూరలో బలి పడడంతో నే ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దోసకాయ కూర తిన్న సుమారు 15 మంది వరకు అస్వస్థత గురైయ్యారు. ప్రస్తుతం హాస్టల్ లో 100 మంది వరకు విద్యార్థులు ఉన్నారు.