తమ పిల్లలను చూపాలని పేరెంట్స్ ఆందోళన హాస్టల్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా

తమ పిల్లలను చూపాలని పేరెంట్స్ ఆందోళన హాస్టల్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా

బాల్కొండ, వెలుగు : పోచంపాడ్ గురుకుల స్టూడెంట్ సాయి లిఖిత మృతితో పిల్లల తల్లిదండ్రులు గురువారం హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలను చూపాలని పట్టుబట్టడంతో ఉధ్రిక్తత నెలకొంది. గంటల తరబడి ఎదురుచూసినా తమ పిల్లల బాగోగులు తెలుపడం లేదని మండిపడ్డారు. పిల్లలను చూసేందుకు సిబ్బంది నిరాకరించారు. మెండోరా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పేరెంట్స్ కు నచ్చజెప్పినా వినలేదు.

గురుకుల హాస్థల్ తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

ఫుడ్ పాయిజన్ తో బాలిక మృతి చెందిన వార్తల నేపథ్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా హాస్టల్ ను తనిఖీ చేశారు. కిచెన్, డార్మెటరీ రూమ్, బియ్యం, నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించారు. మృతి చెందిన బాలిక హాజరు పట్టికను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.