
మద్నూర్, వెలుగు: త్వరలో జరిగే పార్లమెంట్ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని బాన్సువాడ ఆర్డీఓ భుజంగ్రావు పేర్కొన్నారు. మద్నూర్ తహసీల్ఆఫీస్లో సోమవారం పార్లమెంట్ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఎన్నికల విధుల నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. సెక్టోరల్ అధికారులు పోలీస్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్భరత్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ విజయ్, గిర్దావర్ శంకర్, సెక్టరాల్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.