
లోక్ సభలో ఆపరేషన్ కమలపై దుమారం చెలరేగింది. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తోందని, కాంగ్రెస్, సహా విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఇదే అంశాన్ని కర్ణాటక కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించగా.. క్వశ్చన్ అవర్ లో వీటిని అనుమతించబోనని స్పీకర్ సుమిత్రా మహజన్ అన్నారు. దీంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎంపీలు. మరోవైపు 13 పాయింట్ రోస్టర్ విధానంపైనా లోక్ సభలో ఆందోళనలు కొనసాగాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనివర్శిటీ ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందని సమాజ్ వాదీ ఎంపీ నిరసనలు తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేయబోమని, 200 పాయింట్ రోస్టర్ విధానాన్నే అమలు చేస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అవసరమైతే సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని, ఆర్డినెన్స్ తెచ్చేందుకూ సిద్ధమని ప్రకటించినా సమాజ్ వాదీ ఎంపీలు వినిపించుకోలేదు. నినాదాలు చేశారు.