పార్లమెంట్ సెషన్ : 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ

పార్లమెంట్ సెషన్ : 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చ

యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం కానున్నాయి, కీలక చర్చలు సాగనున్నాయి. రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన నాటి నుంచి పార్లమెంటు జర్నీకి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మొదటి రోజున సభ సాగనుంది. లోక్‌సభ, రాజ్యసభ రెండూ గత 75 ఏళ్లలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై నేతలు చర్చించనున్నారు.

Also Rard: ఇన్సూరెన్స్ పాలసీ.. మెచ్యూరిటీ పేరుతో మోసం

సమావేశాల రెండో రోజున అంటే మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్‌ భవనం సమావేశాలకు వేదిక కానున్నది. రెండో రోజు నుంచి ఇరు సభల్లో కేంద్రం పలు బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వీటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజ్యసభలో మూడు బిల్లులు, లోక్‌సభలో నాలుగు బిల్లులకు ఆమోదం తెలపేందుకు  కేంద్రం యోచిస్తోంది. వీటిలో కొన్ని బిల్లులను రాజ్యసభ ఇప్పటికే ఆమోదించగా.. లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉంది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత శాసనసభ కొత్త కాంప్లెక్స్‌కు వెళ్లనుంది. పాత భవనం వారసత్వానికి గౌరవం చెల్లిస్తూ, పది మంది మహిళా పార్లమెంటేరియన్లు తమ అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు, భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణానికి కేంద్రంగా నిలిచిన పాత భవనానికి నివాళులు అర్పించారు.