
గ్రేటర్ పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో హైదరాబాద్ మల్కాజిగిరి ఒకటి. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణకు చెంది న వారితో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన ఉన్నా రు. ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గమనిస్తే.. బరిలో ఉన్న అభ్యర్థి కంటే ఏ పార్టీ అనే అంశమే ఎక్కువ ప్రభావం చూపించిం దనే విషయం స్పష్టమైంది.2009లో ఈ సెగ్మెంట్ లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ, టీడీపీ నుంచి భీమ్ సేన్‍తో పాటు పలువురు పోటీ చేశారు. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రస్థా యిలో ఉంది . ఈ నేపథ్యం లోకేంద్రంలో అధికారం ఉండే పార్టీయే రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తుం దనే భావన ఉంది . కాంగ్రెస్ అప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉంది . ఈ నేపథ్యంలో అభ్యర్థి కంటే పార్టీ పేరుతో నిలబడిన వ్యక్తిని చూసి ఓటేశారు జనం.అప్పటివరకు నియోజకవర్గానికి సుపరిచితుడైన టి.భీంసేన్రెం డో స్థా నానికి పరిమితమయ్యాడు.అలాగే టీడీపీలో తెలంగాణ నుంచి కీలకంగా వ్యవ హారించిన టి.దేవేందర్ డ్ పార్టీ మారి పీఆర్పీ నుంచి ఈ సెగ్మెంట్ లో బరిలో నిలిచారు. ఆయన్ను మూడో స్థా నానికి పరిమితం చేశారు.
2014లోనూ అంతే….
2014 ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజన వేడి తీవ్రం గా ఉంది . అయితే విభజనపై చంద్ర బాబు వైఖరి, కేంద్రంలో మోడీ హవా నేపథ్యంలో టీడీపీ నుంచి పోటీ చేసిన మల్లా రెడ్డి 30వేల మెజార్టీతో టీఆర్‍ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మం తరావుపై గెలిచారు. సర్వే సత్యనారాయణపై 3లక్షల పైచిలుకు ఓట్లను దక్కిం చుకోగలిగారంటే కేవలం కేంద్రంలో ఏ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించగలదనే అంశమే ఇక్కడ ప్రాధాన్యంగా మారిందని తెలుస్తోంది . ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ రేవంత్‍రెడ్డి పోటీ చేస్తుండగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నుంచి అభ్యర్థుల పేర్లు ఖరారు కావాల్సి ఉంది . అయితే ప్రస్తుతం ఈఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న తీరుగా సాగుతున్నాయి. ఇదే విషయం స్థా నిక ఓటర్లలోనూ బలంగా నాటుకుపోయింది . ఓ వైపు కేంద్రంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమని చెబుతుండగా, స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకునే నేతకు మద్దతు ఉంటుందని ఇక్కడివారు చెబుతున్నా రు.