మెడికల్ కాలేజీపై క్లారిటీ ఇవ్వాలి : పాశం భాస్కర్

మెడికల్ కాలేజీపై క్లారిటీ ఇవ్వాలి : పాశం భాస్కర్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్టకు మంజూరైన మెడికల్ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారనే  ప్రచారంపై ప్రభుత్వ క్లారిటీ ఇవ్వాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోమవారం యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. కొండపైన శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పట్టణంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మాట్లాడారు. మెడికల్ కాలేజీ తరలింపుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బాధ్యత తీసుకొని క్లారిటీ ఇవ్వాలని సూచించారు. ఆటోలను తిరిగి కొండపైకి అనుమతించడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని చెప్పారు.   వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

భువనగిరి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం క్యాడర్ డెడికేషన్ తోపనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో యాదగిరిగుట్ట నుంచి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల శ్రీనివాస్, యాదగిరిగుట్ట అధ్యక్షుడు శ్యాంసుందర్, జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య,  ప్రధాన కార్యదర్శి రాఘవుల నరేందర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గుంటుపల్లి సత్యం, బీజేవైఎం అధ్యక్షుడు  బాలరాజు,  నేతలు లెంకలపల్లి శ్రీనివాస్,  అశోక్ గౌడ్, బాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్ ఉన్నారు.