లోయలో పడిన బస్సు..శ్రీలంకలో 15 మంది మృతి

లోయలో పడిన బస్సు..శ్రీలంకలో 15 మంది మృతి

కొలంబో: శ్రీలంకలో జరిగిన ఘోర ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. గురువారం ఉవ ప్రావిన్స్‌‌‌‌లోని బదుల్లా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 30 మందికి పైగా ప్రయాణికులు ఓ బస్సులో దక్షిణ తంగల్లే పట్టణం నుంచి యాత్రకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న జీపు ఢీకొట్టింది.

 దీంతో పక్కనున్న రెయిలింగ్‌‌‌‌ను ఢీకొట్టి బస్సు వెయ్యి అడుగులకు పైగా లోతు ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌ చేపట్టారు. సహాయక చర్యల్లో మిలిటరీ, డిజాస్టర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్ టీమ్‌‌‌‌లు, స్థానికులు పాల్గొన్నారు. మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. గాయపడిన వారిని బదుల్లా టీచింగ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.