ఈనెల 11న ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్

ఈనెల 11న ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్

74వ బ్యాచ్‌కు చెందిన IPS ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్ ఈనెల 11న జరగనుంది. పాసింగ్ ఔట్ పరేడ్‭కు చీఫ్ గెస్ట్ గా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 195 మంది మంది ఐపీఎస్‌లు 15 వారాల పాటు ముస్సోరిలో, 46 వారాల పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 37 మంది మహిళా ఐపీఎస్ లు ఉన్నారు. ఈ బ్యాచ్ నుంచి తెలంగాణకు ఐదుగురు, ఏపీకి ఇద్దరు ట్రైనీ ఆఫీసర్లను కేటాయించారు. వీరంగా 30 వారాల పాటు డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం మరో 10 వారాల పాటు అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది 

సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతుండటంతో లైవ్ కేసులను చూపించి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ సారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు.  ఇండోర్, ఔట్ డోర్ సబ్జెక్ట్‭లు కలిపి 17 అంశాలపై వీరంతా శిక్షణ పొందారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, ప్రాపర్టీ, ఎన్డీపీఎస్ కేసులు, సైబర్ నేరాలు, కోర్టు కేసుల ట్రయిల్స్, టెక్నికల్, ఫైనాన్షియల్ క్రైమ్స్ కు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్పారు.