WTC Final 2023: ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే.. భారత జట్టు సస్పెన్స్?

WTC Final 2023: ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే.. భారత జట్టు సస్పెన్స్?

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌తో తలపడబోయే ఆస్ట్రేలియా తుది జట్టు ఏదో ఆ టీం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తేల్చేశాడు. తమ తుది జట్టులో ఎలాంటి ఆశ్చర్యకర నిర్ణయాలు ఉండబోవన్న కమిన్స్, గాయపడ్డ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలిపాడు. దీంతో ఆసీస్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోందన్నది స్పష్టమవుతోంది.

'గతంలో ఇంగ్లండ్ పిచ్‌లపై బంతి బాగా స్వింగ్ అయ్యేది. ప్రతి బంతికి వికెట్లు తీయాలని బౌలర్లు ఉత్సాహం చూపేవారు. ఇప్పుడూ అదే ఆశిస్తున్నాం.. ఓపిగ్గా ఎదురుచూస్తూ సరైన స్థానాల్లో బంతులు వేయగలిగితే వికెట్లు వాతంటవే అవే వస్తాయి.." అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కమిన్స్ మాటలను బట్టి  డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులో స్థానం ఖాయమనిపిస్తోంది. మార్కస్ హ్యారిస్ బదులు ఎంతో అనుభవం ఉన్న వార్నర్ వైపే మొగ్గు చూపొచ్చు. అతనితో ఉస్మాన్ ఖవాజా ఓపెనింగ్ చేయనున్నాడు. ఆపై లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీలతో కూడినఆసీస్ బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తోంది.

ఇక భారత జట్టు విషయానికొస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు ఎంపికను సస్పెన్స్‌లో పెట్టాడు. 'కాంబినేషన్ల గురించి ఈరోజు ఏమీ చెప్పలేను. ఇక్కడి(ఇంగ్లండ్) పిచ్, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగా మా తుది జట్టును రేపు నిర్ణయిస్తాం.. అందరూ సిద్ధంగా ఉండాలి..' అని రోహిత్ చెప్పాడు.

ఆస్ట్రేలియా తుది జట్టు(అంచనా): ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిడ్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), నాథన్ లయన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్.

టీమిండియా తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ.