IPL 2024: అన్నాడంటే జరగాల్సిందే: సన్ రైజర్స్‌ కెప్టెన్ కాన్ఫిడెంట్ మాములుగా లేదుగా

IPL 2024: అన్నాడంటే జరగాల్సిందే: సన్ రైజర్స్‌ కెప్టెన్ కాన్ఫిడెంట్ మాములుగా లేదుగా

ఆస్ట్రేలియా వన్డే, టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందేనేమో. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అహ్మదాబాద్ లో ఉన్న స్టేడియాన్ని సైలెంట్ గా చేస్తామ అని చెప్పి చూపించాడు. భారత గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ కమ్మిన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ మ్యాచ్ లో ఆసీస్ ప్రదర్శన చూసిన తర్వాత కమిన్స్ ఛాలెంజ్ చేసి గెలిచి అది తనలో ఉన్న విశ్వాసం అని నిరూపించాడు.

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కమ్మిన్స్..  తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేసి తెలుగు అభిమానులను ఖుషీ చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచ్ కోసం తమ ప్రణాళికల గురించి మాట్లాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో భాగంగా సన్ రైజర్స్ జట్టు దూకుడుగా ఆరంభిస్తుందని చెప్పుకొచ్చాడు. గతంలో కేకేఆర్ కు ఆడిన అనుభవం తనకు పనికి వస్తుందని కమ్మిన్స్ అన్నాడు. టీ20 ఆడటం చాలా కష్టమని.. ప్రణాళిక బద్ధంగా ఆడితే విజయం వస్తుందని కొత్త సన్ రైజర్స్ కెప్టెన్ తెలిపాడు. మార్చి 23న సన్ రైజర్స్ తమ తొలి మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ తో తలబడుతుంది.   

కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్ ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది. 

Also Read :ధోనీకిదే చివరి ఐపీఎల్.. గైక్వాడ్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అదేనా

స్టార్ ప్లేయర్ అయినప్పటికీ.. ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమ్మిన్స్ ను SRH యాజమాన్యం అంత పిచ్చిగా ఏమీ కొనలేదని అర్ధమవుతుంది. గత సీజన్ లో హైదరాబాద్ జట్టు చెత్త ప్రదర్శనతో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్ ల్లో కేవలం 4 మ్యాచ్ ల్లోనే గెలిచి 10 ఓడిపోయింది. ఈ ఓటమికి కెప్టెన్ మార్కరం అనుభవం లేని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కమిన్స్ ను కెప్టెన్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 

కమ్మిన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరుంది. 2023 లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. కమ్మిన్స్ సన్ రైజర్స్ కెప్టెన్ అయితే ఇక తిరుగుండదు. కెప్టెన్ కోసమే కమ్మిన్స్ కు భారీ ధర వెచ్చించారని స్పష్టంగా అర్ధం అవుతుంది. మరి తన కెప్టెన్సీతో కమ్మిన్స్ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.