టీపీసీసీ ప్రెసిడెంట్​ను కలిసిన నేతలు

టీపీసీసీ ప్రెసిడెంట్​ను కలిసిన నేతలు

రామచంద్రాపురం, వెలుగు : టీ పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్​కుమార్​గౌడ్​ను మంగళవారం పటాన్​చెరు కాంగ్రెస్​ ముఖ్య నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నేత గాలి అనిల్ కుమార్, పటాన్​చెరు నియోజకవర్గ ఇన్​చార్జి కాట శ్రీనివాస్​గౌడ్​ హైదరాబాద్​లో మహేశ్ కుమార్​ను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్​కొత్త నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందన్నారు.

వారి వెంట సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్​రావు, జనరల్​ సెక్రటరీ సుధాకర్​ రెడ్డి, అధికార ప్రతినిధి మాధవ రెడ్డి, తెల్లాపూర్​ మున్సిపాలిటీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, సోషల్​మీడియా కోఆర్డినేటర్​ప్రవీణ్ కుమార్, మైనార్టీ ప్రెసిడెంట్ మహ్మద్​అక్రమ్​ఉన్నారు.