హైదరాబాద్: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గాయపడ్డారు. ఇంట్లో బాత్రూంలో జారి పడడంతో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భయపడాల్సిన అవసరమేమి లేదని.. రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు డాక్టర్లు. దీంతో రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉండనున్నారు.

