న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఫుడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ.1.75 తాత్కాలిక డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ బోర్డు ఈ నెల 13ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించగా, అర్హులైన షేర్ హోల్డర్లకు ఈ ఏడాది డిసెంబర్ 7లోపు డివిడెండ్ చెల్లిస్తారు. కంపెనీ షేర్లు శుక్రవారం రూ.579 దగ్గర ముగిశాయి.
పతంజలి ఫుడ్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‌తో క్వార్టర్ (క్యూ2) లో పతంజలి ఫుడ్స్ రూ.516.69 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది ఇదే టైమ్‌లో వచ్చిన రూ.308.8 కోట్లతో పోలిస్తే 67శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.8,132.76 కోట్ల నుంచి రూ.9,850.06 కోట్లకు చేరింది.
