
భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ఎంట్రీ ఇచ్చిన పఠాన్ బాక్సాఫీస్ ను బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. మూవీ రిలీజై 8 రోజులైనా కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కేవలం 8 రోజుల్లోనే రూ.667 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. తక్కువ రోజుల్లోనే ఈ మార్కును చేరుకున్న ఇండియన్ సినిమాగా పఠాన్ మూవీ చరిత్ర సృష్టించింది. అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన ఇండియన్ మూవీస్ లిస్టులో పఠాన్ 8వ ప్లేస్ లో ఉంది.
కేవలం 8 రోజుల్లో హిందీ వర్షన్ లో ఈ మూవీ రూ. 336 కోట్లు వసూలుచేసింది. ఇక తెలుగు, తమిళంలో 8 రోజుల్లో 12.50 కోట్లు వచ్చాయి. మొత్తం కలిపి ఈ మూవీ ఇండియాలో 358.50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత హిట్ లేకుండా ఉన్న షారూఖ్ ఖాన్ కు ఈ మూవీ ఒక విధంగా కమ్ బ్యాక్ అని చెప్పవచ్చు.