సర్కారీ దావఖాన: సర్జరీలు చేసి నేలపై పడుకోబెట్టారు

సర్కారీ దావఖాన: సర్జరీలు చేసి నేలపై పడుకోబెట్టారు
  • మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆసుప్రతిలో మౌలిక వసతుల తీరిదీ

సర్కారీ దావఖానకు పోవాలంటేనే జనం భయపడుతున్నారు. అక్కడ వసతుల కొరత, మందుల కొరత, డాక్టర్ల కొరత.. కొరత లేనిదేమీ ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో కళ్లకు కట్టే ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిన వాళ్లు పడుకోవడానికి కూడా కనీసం బెడ్‌లు లేదు. నేలపైనే పడుకోని నిద్రపోవాల్సిన దుస్థతి.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లను ఇలా నేలపై పడుకోబెట్టారు ఆసుపత్రి సిబ్బంది. దీనిపై ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్ త్రిపాఠిని ప్రశ్నించగా.. రోజూ 30 మంది వరకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరుగుతాయని చెప్పారు. అయితే వారికి సరిపడా మంచాలు ఆసుపత్రిలో లేవని, మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపరచాల్సి ఉందని చెబుతున్నారు.