అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర

 అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి  యాత్ర

 పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి  యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. నాలుగో దశ వారాహి విజయ యాత్రకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే మూడు దఫాలు వారాహి యాత్రను పవన్ నిర్వహించారు. నాలుగో దశ యాత్రకు రెడీ అవుతున్నారు. అక్టోబరు 1వ తేదీ పవన్ యాత్ర ప్రారంభం కానుంది. 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారాహి వాహనంపై నుంచి పవన్‌ ప్రసంగిస్తారు. మచిలీపట్నంలో  2,3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ కల్యాణ్ పర్యటిస్తారని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. 

ALSO READ: త్వరలో కురక్షేత్ర యుద్దం జరగబోతోంది: సీఎం జగన్