బిగ్ బాస్లో ప్రేమ.. బయటికి వచ్చాక నిశ్చితార్ధం.. ఇప్పుడు బ్రేకప్

బిగ్ బాస్లో ప్రేమ.. బయటికి వచ్చాక నిశ్చితార్ధం.. ఇప్పుడు బ్రేకప్

బాలీవుడ్ బుల్లితెర జంట ఇజాజ్‌ ఖాన్‌-పవిత్ర పూనియా బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ వార్తలు వైరల్ అవుతున్నా.. ఈ జంట మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దాంతో ఇవన్నీ నిజంగా రూమర్స్ అనుకున్నారంతా. కానీ.. తాజాగా పవిత్ర ఈ వార్తలపై తొలిసారి స్పందిస్తూ ఆడియన్స్ కు షాకిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించింది. 

నా ఫ్యాన్స్ తో నేను ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. అందరినీ నేను ఒకటే వేడుకుంటున్నా.. దయచేసి మా బ్రేకప్‌ గురించి మాట్లాడకండి. మా ప్రైవసీకి భంగం కలిగించకండి. ప్రస్తుతం నా కెరీర్‌ పైనే ఫోకస్‌ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్యే నా తండ్రిని కోల్పోయాను. ప్రస్తుతం అన్నయ్యతో ఉంటున్నాను. అతనిది చిన్న పిల్లాడి మనస్తత్వం. ఇప్పుడు నా కుటుంబ బాధ్యత నేను తీసుకున్నాను. అది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంతకంటే చెప్పలేను. ఇప్పట్లో పెళ్లి ఆలోచన చేయడం లేదు. మా రిలేషన్‌ గురించి ప్రచారం జరుగుతున్న వార్తలు నిజమే.. అంటూ తన బ్రేకప్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చింది నటి పవిత్ర పూనియా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక నటి పవిత్ర పూనియా విషయానికి వస్తే.. యే హై మొహబ్బతే, నాగిన్‌, లవ్‌ యూ జిందగీ వంటి సీరియల్స్‌తో ఆడియన్స్ బాగా దగ్గరయ్యారు. ఇటీవలే ఆమె హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో కూడా పాల్గొన్నారు. ఈ సీజన్ సమయంలోనే పవిత్ర పూనియాతో ఇజాజ్‌ ఖాన్‌  పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. రేపో మాపో పెళ్లి చేసుకుంటారు అనుకునేలోపే బ్రేకప్‌ చెప్పుకుని విడిపోయారు ఈ జంట. ప్రస్తుతం ఈ జంట బ్రేకప్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.