పవన్ కళ్యాణ్ 150 కోట్ల బడ్జెట్‌ మూవీ..  ‘హరిహర వీరమల్లు’

పవన్ కళ్యాణ్ 150 కోట్ల బడ్జెట్‌ మూవీ..  ‘హరిహర వీరమల్లు’

ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ళ్యాణ్ అభిమానులకు శుభవార్త. 150 కోట్ల బడ్జెట్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి నిర్మిస్తున్న కొత్త మూవీకి టైటిల్ ఖరారు చేశారు. టైటిల్  'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'  ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్ విడుద‌ల  చేశారు. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ  ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం ఈ ఎపిక్‌ చిత్రానికి సమర్పకులు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ' హరి హర వీరమల్లు' గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. "ఇది ఒక లెజెండ‌రీ బందిపోటు వీరోచిత గాథ." అని డైరెక్ట‌ర్ క్రిష్ చెప్పారు. నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో ఒక ఇంద్ర‌జాలికుడు లాంటి ఆయ‌న త‌న ట్రేడ్‌ మార్క్ అంశాల‌న్నీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌. భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా ఎవరూ చెప్ప‌ని క‌థ‌తో.. ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్నిఇచ్చేలా తీస్తున్నామని డైరెక్టర్ క్రిష్ చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చార్మినార్, రెడ్ ఫోర్ట్, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’షూటింగ్ 40  శాతం పూర్త‌యింది. జూలై నాటికి మొత్తం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తామంటున్నారు నిర్మాత‌ ఎ. ద‌యాక‌ర్ రావు.  పీరియడ్ డ్రామా ఫిల్మ్ కావడంతో, వీఎఫ్ఎక్స్ ప‌నుల కోస‌మే ఆరు నెలల సమయాన్ని కేటాయించారు. ప‌లుహాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన బెన్ లాక్ ఈ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను పర్యవేక్షిస్తారు.