హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ కొత్త సినిమా 

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ కొత్త సినిమా 

పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఇదివరకు ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. అయితే, గత కొంతకాలంగా మూవీకి సంబంధించిన  ఎలాంటి అప్ డేట్ ని అనౌన్స్ చేయని చిత్ర బృందం, తాజాగా సినిమా పేరును మారుస్తూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ పేరుతో ఉన్న టైటిల్, పోస్టర్ ని విడుదల చేసింది. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్ లైన్ తో పాటు, ‘ఈ సారి కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు’ అనే థీమ్ లైన్ కూడా ఇచ్చారు.  

ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయాంక్ బోస్ సినిమాటోగ్రాఫర్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ దర్శకుడు దశరథ్ స్ర్కిప్ట్ వర్క్ లో పనిచేస్తున్నడు. అయితే, ఈ సినిమాని ‘తేరి’ అనే తమిళ సినిమా రీ మేక్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు రావడంతో, పవన్ ఫ్యాన్ అంతా ‘రీ మేక్’ వద్దని ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేశారు. దాంతో సినిమా స్క్రిప్ట్ ని పూర్తిగా మార్చినట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ కెరీర్ లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ని అంధించిన హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పవన్ ఫ్యాన్స్ ని ఎలా అలరిస్తాడో వేచి చూడాలి.