
- పిఠాపురం నుంచి నామినేషన్
హైదరాబాద్, వెలుగు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఐదేండ్లలో రూ. 114 కోట్లు సంపాదించగా.. పన్నుల రూపంలో 73.92 కోట్లు చెల్లించారు. తనకు రూ. 64.26 కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఆయన మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలను వెల్లడించారు.
వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి రూ.46.70 కోట్లు రుణంగా తీసుకున్నానని, తన వదిన, ప్రముఖ హీరో చిరంజీవి భార్య సురేఖ నుంచి రూ.2 కోట్లు అప్పుగా తీసుకున్నానని పేర్కొన్నారు. ‘‘మైత్రీ మూవీ మేకర్స్, హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతల నుంచి అప్పులు తీసుకున్నా. పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల రూ.17.15 కోట్లు విరాళం అందించా. వివిధ సంస్థలకు రూ.3.32 కోట్ల విరాళాలిచ్చా. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున, అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ.30,11,117 విరాళంగా అందజేశా”అని పవన్ వివరించారు.