బ్రో(BRO) మూవీ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉంది అంటే.. భలే ఉంది అంటున్నారు ఫ్యాన్స్. ఇటీవల కాలంలో వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్(PawanKalyan) సినిమాలకు భిన్నంగా.. బ్రో మూవీ టీజర్ ఉండటం విశేషం. పవన్ మేనరిజం.. డైలాగ్స్ డెలివరీ.. యాక్టింగ్.. కళ్లు ఎగరేసే ఆ చూపులు, పంచ్ డైలాగ్స్ చెప్పే విధానం.. ఈజీ యాక్టింగ్.. ఈజీ డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ చూస్తుంటే.. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయిన.. పవన్ కల్యాణ్ అల్టిమేట్ మూవీస్ లో ఒక్కటిగా ఉన్న ఖుషీ మూవీ గుర్తుకొస్తుంది ఫ్యాన్స్ కు.
ఖుషీ సినిమాలో కూడా ఇంతే.. డైలాగ్స్ డెలివరీ... ఈజీ యాక్టింగ్.. చూపులతోనే చంపేసే నటన.. ఓ ట్రెండ్ స్టిట్టింగ్.. మళ్లీ ఇన్నాళ్లకు.. పవన్ కల్యాణ్ లో అలాంటి నటన చూస్తున్నామని ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు.
ఫ్యాన్స్ అంటే అన్నారు అనుకోవచ్చు కానీ.. బ్రో మూవీ టీజర్ చూస్తే సామాన్య ఆడియన్స్ కు కూడా ఇదే ఫీలింగ్ వస్తుంది. ఎంట్రీ ఇస్తూ.. ఇంటి తలుపు మధ్యలో నిలబడి.. పవన్ కల్యాణ్ ఇచ్చే స్టయిల్ ఉంది చూడండీ.. ఫ్యాన్స్ కు మత్తెక్కించేసింది. ఎర్ర చొక్కా.. గళ్ల లుంగీ.. చేతిలో టీ గ్లాస్.. నోట్లో టూత్ పిక్.. వీటితోపాటు పవన్ కల్యాణ్ లో సహజంగా ఉండే చిరునవ్వు.. అబ్బబ్బ.. స్టయిల్ అదరటమే కాదు.. అప్పుట్లో ఖుషీ లాంటి కిక్కు ఇచ్చారంటున్నారు ఫ్యాన్స్.
బ్రో టీజర్ లో మరో విశేషం ఏంటంటే.. ఎక్కడా పొలిటికల్ టచ్ అనేది లేదు.. ఓన్లీ మూవీకి సంబంధించిన డైలాగ్ డెలివరీలు, మేనరిజాలు మాత్రమే ఉంటూ.. అది కూడా పవన్ కల్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఆశిస్తారో అదే చూపించటంలో బ్రో మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఓవరాల్ గా బ్రో టీజర్ చూస్తే.. ఫ్యాన్స్ మాత్రం ఖుషీ ఖుషీ అంటూ.. ఖుషీ మూవీ చూసినంత ఆనందంలో ఉన్నారు.. అప్పట్లో ఖుషీ మూవీలో ఎలాంటి ఫన్నీ డైలాగ్స్, మేనరిజంతో అద్భుతం చేశారో.. మళ్లీ బ్రో మూవీతో అలాంటి అద్భుతం పవన్ కల్యాణ్ చేయబోతున్నారనేది.. టీజర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ టాక్..
