Pawan Kalyan: 'OG' తొలి టికెట్ రూ. 5 లక్షలు.. పవర్‌స్టార్‌కు ఫ్యాన్స్ సర్ప్రైజ్!

Pawan Kalyan: 'OG' తొలి టికెట్ రూ. 5 లక్షలు..   పవర్‌స్టార్‌కు ఫ్యాన్స్ సర్ప్రైజ్!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన 54వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చారు. ఆయన 'OG'  సినిమా తొలి టికెట్‌ను ఆన్‌లైన్ వేలంలో ఏకంగా రూ.5 లక్షలకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు పవర్ స్టార్ అభిమానులు. ఈ డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని ప్రకటించడంతో ఈ సంఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అమెరికా ఫ్యాన్ క్లబ్ అయిన 'టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా' ఈ భారీ మొత్తానికి టికెట్‌ను దక్కించుకుంది.

ఎలా జరిగింది ఈ వేలం?
పవన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు..  ఆయన అభిమానులు 'X స్పేసెస్'  వేదికగా ఈ ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది అభిమానులు ఈ వేలంలో పాల్గొని బిడ్డింగ్ తీవ్ర స్థాయిలో కొనసాగించారు. చివరికి నార్త్ అమెరికా ఫ్యాన్ క్లబ్ ఈ బిడ్‌ను రూ.5 లక్షలకు గెలుచుకుంది. ఈ వేలం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నిజాం ఫస్ట్ టికెట్ ఆక్షన్ విన్నర్.. టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా.. రూ.5 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ డబ్బు జనసేన పార్టీకి డొనేట్ చేయనున్నట్లు వేలం నిర్వాహకులు తెలిపారు..

 

'గ్యాంగ్‌స్టర్' నేపథ్యంలో.. 
'దే కాల్ హిమ్ OG' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాకు దర్శకుడు సుజీత్. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 'ఓజస్ గంభీర' అనే టైటిల్ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పాత్ర పేరు ఓమి భాయ్. ఈ సినిమాలో ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయ రెడ్డి, హరీష్ ఉత్తమన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'OG' సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతోందో చూడాలి మరి.