
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. పవన్ అంటే కేవలం అభిమానులే.. కాదు చాలా మంది హీరో, హీరోయిన్స్ కు కూడా ఆయనంటే పది చస్తారు. చాలామంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ.. హీరోలనే ఫ్యాన్స్ గా ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. అయితే ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న పవన్ కు ఏ హీరోయిన్ ఫేవరెట్ అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి.
కాగా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పవన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అలనాటి నటి సావిత్రి ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపారు. ఆమె సినిమాలన్నా, ఆమె నటన అన్నా తనకెంతో ఇష్టమని తెలిపారు పవన్. ఇక నటిగా కంటే.. వ్యక్తిగా తనను ఎక్కువగా ఇష్టపడేవారు పవన్. ఎందుకంటే.. సావిత్రికి కూడా పవన్ లాగే సేవా గుణం ఎక్కువే. అందుకే ఆమె అంటే పవన్ కు ఇష్టం అనే వార్తలు వినిపిస్తున్నాయి.