Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు అప్డేట్..ధర్మం కోసం యుధ్ధం మొదలు

Hari Hara Veera Mallu: హరి హర వీర మల్లు అప్డేట్..ధర్మం కోసం యుధ్ధం మొదలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu )ఒకటి. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)  కొంత భాగం తెరకెక్కించగా..ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. 

పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 'ఆగస్టు 14న ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లో వార్ ఎపిసోడ్ షూటింగ్‌ను' షురూ చేసినట్లు తెలిపారు. "ఈ భారీ యాక్షన్ ఘట్టం ఫైట్ మాస్టర్ స్టన్ శివ ఆధ్వర్యంలో 400-500 మందికి పైగా ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. మరికొద్ది రోజుల్లో మన హీరో పవన్ కళ్యాణ్ చేరనున్నారు" అంటూ పోస్ట్ చేశారు. 

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.