
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu )ఒకటి. క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది.
తాజాగా శ్రీరామనవమి సందర్బంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు నుంచి టీజర్ రాబోతుందని అనౌన్స్ చేశారు."జై శ్రీరామ్..శ్రీరామనవమి శుభాకాంక్షలతో..మీ ముందుకు..‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో!" అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో పవర్ స్టార్ సీరియస్ లుక్‌లో భీకరమైన కంటి చూపుతో సెగలు గుప్పిస్తున్నాడు. అయితే టీజర్ రిలీజ్ అయ్యేది ఇవాళ లేదా మరేదైనా తేదీలో విడుదల చేస్తారనేది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… ?
— Mega Surya Production (@MegaSuryaProd) April 17, 2024
మీ ముందుకు... ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! #HariHaraVeeraMallu Teaser Out Soon! ?@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes pic.twitter.com/gqopvkFtWb
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.