జనసేనానికి డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ.. సున్నితంగా తిరస్కరించిన పవన్

జనసేనానికి డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ.. సున్నితంగా తిరస్కరించిన పవన్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ(Wales University,) వారు జనసేనాని(Janasena)కి డాక్టరేట్ ప్రధానం చేసేందుకు ఎంపిక చేశారు. ఈ నెలలోనే జరుగునున్న తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి  హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు.

అయితే జనసేనాని పవన్ కల్యాణ మాత్రం డాక్టరేట్ అందుకోవడానికి నిరాకరించారు. అంతేకాదు.. వివిధ రంగాలలో గొప్పగా రాణించిన  వ్యక్తులు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. వేల్స్ యూనివర్సిటీకి లేఖ రాశారు పవన్. 

వేల్స్ యూనివర్సిటీ నన్ను డాక్టరేట్ కి ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. అలాగే గౌరవంగా భావిస్తున్నాను. కానీ, నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో సరైన వారికి ఈ డాక్టరేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోతున్నాను.. అంటూ లేఖలో రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.